Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 30, 2013

2వ సమూయేలు 1

2Sa 1:1  దావీదు అమాలేకీయులను హతముచేసి తిరిగి వచ్చెను. సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను. 
2Sa 1:2  మూడవ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్న దండులోనుండి వచ్చెను. 
2Sa 1:3  అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదునీ వెక్కడనుండి వచ్చితివని యడి గెను. అందుకు వాడుఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను. 
2Sa 1:4  జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడుజనులు యుద్ధమందు నిలువ లేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. 
2Sa 1:5  సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను 
2Sa 1:6  గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను. 
2Sa 1:7  అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకుచిత్తము నా యేలినవాడా అని నేనంటిని. 
2Sa 1:8  నీవెవడవని అతడు నన్నడుగగానేను అమాలేకీయుడనని చెప్పితిని. 
2Sa 1:9  అతడునా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను? నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా, 
2Sa 1:10  ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణము లను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. 
2Sa 1:11  దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్ద నున్న వారందరును ఆలాగున చేసి 
2Sa 1:12  సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి. 
2Sa 1:13  తరువాత దావీదునీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవాని నడుగగా వాడునేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను. 
2Sa 1:14  అందుకు దావీదుభయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి? 
2Sa 1:15  యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే; 
2Sa 1:16  నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచినీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. 
2Sa 1:17  యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను. 
2Sa 1:18  అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా 
2Sa 1:19  ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారునీ ఉన్నత స్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి. 
2Sa 1:20  ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లుఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. 
2Sa 1:21  గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైననులేకపోవును గాక. బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు1సౌలు డాలును పారవేయబడెను. 
2Sa 1:22  హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండయోనాతాను విల్లు వెనుకతియ్యలేదుఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు. 
2Sa 1:23  సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులు గాను నెనరుగల వారుగాను ఉండిరితమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారువారు పక్షిరాజులకంటె వడిగలవారుసింహములకంటె బలముగలవారు. 
2Sa 1:24  ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడుబంగారు నగలు మీకు పెట్టినవాడు. 
2Sa 1:25  యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారునీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను. 
2Sa 1:26  నా సహోదరుడా, యోనాతానానీవు నాకు అతిమనోహరుడవై యుంటివినీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నానునాయందు నీకున్న ప్రేమ బహు వింతైనదిస్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది. 
2Sa 1:27  అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరియుద్ధసన్నద్ధులు నశించిపోయిరి. 

2వ సమూయేలు 2

2Sa 2:1  ఇది జరిగిన తరువాతయూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగాపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగాహెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. 
2Sa 2:2  కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. 
2Sa 2:3  మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. 
2Sa 2:4  అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. 
2Sa 2:5  సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపిమీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక. 
2Sa 2:6  యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను. 
2Sa 2:7  మీ యజమానుడగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను. 
2Sa 2:8  నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి, 
2Sa 2:9  గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయిమీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. 
2Sa 2:10  సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేల నారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. 
2Sa 2:11  దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు. 
2Sa 2:12  అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారు డగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా 
2Sa 2:13  సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులును బయలుదేరి వారి నెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా 
2Sa 2:14  అబ్నేరు లేచిమన యెదుట ¸°వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను. 
2Sa 2:15  లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి. 
2Sa 2:16  ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని1 ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. 
2Sa 2:17  తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి. 
2Sa 2:18  సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక 
2Sa 2:19  అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా 
2Sa 2:20  అబ్నేరు వెనుకకు తిరిగినీవు అశా హేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశా హేలునే యనెను. 
2Sa 2:21  నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ¸°వనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా 
2Sa 2:22  అబ్నేరునన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగల ననెను. 
2Sa 2:23  అతడునేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరి గాని 
2Sa 2:24  యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్త మించెను. 
2Sa 2:25  బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని, ఒక కొండమీద నిలువగా 
2Sa 2:26  అబ్నేరు కేకవేసికత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను. 
2Sa 2:27  అందుకు యోవాబుదేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయియుందురని చెప్పి 
2Sa 2:28  బాకా ఊదగా జనులందరు నిలిచి, ఇశ్రాయేలువారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. 
2Sa 2:29  అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంత మైదానము గుండ ప్రయాణము చేసి యొర్దానునది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి. 
2Sa 2:30  యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక పందొమ్మండుగురు లేకపోయిరి. 
2Sa 2:31  అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను మూడువందల అరువది మందిని హతము చేసిరి. 
2Sa 2:32  జనులు అశాహేలును ఎత్తికొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి. 

2వ సమూయేలు 3

2Sa 3:1  సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. 
2Sa 3:2  హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను. 
2Sa 3:3  కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను. 
2Sa 3:4  నాలుగవవాడగు అదోనీయా హగ్గీతువలన పుట్టెను. అయిదవవాడగు షెఫట్య అబీటలువలన పుట్టెను. 
2Sa 3:5  ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లావలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. 
2Sa 3:6  సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను. 
2Sa 3:7  అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెనునా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా 
2Sa 3:8  అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొనినిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా? 
2Sa 3:9  యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చనియెడల 
2Sa 3:10  దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదననెను. 
2Sa 3:11  కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను. 
2Sa 3:12  అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపిఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదుమంచిది; నేను నీతో నిబంధన చేసెదను. 
2Sa 3:13  అయితే నీవుఒకపని చేయవలెను; దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను. 
2Sa 3:14  మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపిఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా 
2Sa 3:15  ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను. 
2Sa 3:16  దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరునీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను. 
2Sa 3:17  అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించిదావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా 
2Sa 3:18  నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. 
2Sa 3:19  మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను. 
2Sa 3:20  అందు నిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతనివారికిని విందు చేయించెను. 
2Sa 3:21  అంతట అబ్నేరునేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవుపుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను. 
2Sa 3:22  పిమ్మట దావీదు సేవకులును యోవాబును బందిపోటునుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసికొనిరాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను, దావీదు అతనికి సెలవిచ్చియున్నందున అతడు సమాధానముగా వెళ్లిపోయి యుండెను. 
2Sa 3:23  అయితే యోవాబును అతనియొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చెననియు, రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు, అతడు సమాధానముగా వెళ్లిపోయెననియు తెలిసికొని 
2Sa 3:24  యోవాబు రాజునొద్దకు వచ్చిచిత్తగించుము, నీవు ఏమిచేసితివి? అబ్నేరు నీయొద్దకు వచ్చి నప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపి వేసితివి? 
2Sa 3:25  నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటిని నీవు చేయు సమస్తమును తెలిసికొనుటకై అతడు వచ్చెనని చెప్పి 
2Sa 3:26  దావీదునొద్దనుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావిదగ్గరనుండి అతనిని తోడుకొని వచ్చిరి; అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను. 
2Sa 3:27  అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడుసంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను. 
2Sa 3:28  ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిన దేమనగానేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికిని నిరపరాధులమే. 
2Sa 3:29  ఈ దోషము యోవాబుమీదను అతని తండ్రికి పుట్టిన వారందరిమీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావముగలవాడైనను కుష్ఠరోగి యైనను కఱ్ఱపట్టుకొని నడుచువాడైనను ఖడ్గముచేత కూలు వాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. 
2Sa 3:30  ఆలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును, అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అశాహేలును చంపిన దానినిబట్టి అతని చంపిరి. 
2Sa 3:31  దావీదుమీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో నున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను. 
2Sa 3:32  రాజును స్వయముగా పాడెవెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధిదగ్గర ఎలుగెత్తి యేడ్చెను, జనులంద రును ఏడ్చిరి. 
2Sa 3:33  మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను. 
2Sa 3:34  ఎట్లనగా అబ్నేరూ నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా?నీ చేతులకు కట్లు లేకుండగనునీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగనుదోషకారి యెదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనులందరు విని మరియెక్కువగా ఏడ్చిరి. 
2Sa 3:35  ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసిసూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకనెను. 
2Sa 3:36  జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతో షించిరి; రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అను కూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. 
2Sa 3:37  నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను. 
2Sa 3:38  పిమ్మట రాజు తన సేవకు లను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెనునేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియుపెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. 
2Sa 3:39  పట్టాభిషేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలముగలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడు చేయునుగాక. 

2వ సమూయేలు 4

2Sa 4:1  హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను, ఇశ్రాయేలు వారి కందరికి ఏమియు తోచకయుండెను. 
2Sa 4:2  సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి; వారిలో ఒకని పేరు బయనా, రెండవవానిపేరు రేకాబు; వీరు బెన్యామీనీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయే రోతుకూడను బెన్యామీనీయుల దేశములో చేరినదని యెంచబడెను. 
2Sa 4:3  అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటివరకు అక్కడి కాపురస్థులైయున్నారు. 
2Sa 4:4  సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలునుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానమువచ్చి నప్పుడు వాడు అయిదేండ్లవాడు; వాని దాది వానిని ఎత్తికొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. 
2Sa 4:5  రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి యెండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషెతు మంచముమీద పండుకొనియుండగా అతని యింటికి వచ్చిరి. 
2Sa 4:6  గోధుమలు తెచ్చెదమని వేషము వేసికొని వారు ఇంటిలో చొచ్చి, ఇష్బోషెతు పడకటింట మంచము మీద పరుండియుండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొనిపోయిరి. 
2Sa 4:7  వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసికొని రాత్రి అంతయు మైదాన ములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదునొద్దకు ఇష్బోషెతు తలను తీసికొనివచ్చిచిత్త గించుము; 
2Sa 4:8  నీ ప్రాణము తీయచూచిన సౌలుకుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చియున్నాము; ఈ దినమున యెహోవా మా యేలినవాడవును రాజవునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతికారము చేసి యున్నాడని చెప్పగా 
2Sa 4:9  దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను 
2Sa 4:10  మంచి వర్తమానము తెచ్చితినని తలంచియొకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియజెప్పగా 
2Sa 4:11  వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి, అతని మంచము మీదనే నిర్దోషియగువానిని చంపినప్పుడు మీచేత అతని ప్రాణదోషము విచారింపక పోవుదునా? లోకములో ఉండకుండ నేను మిమ్మును తీసివేయక మానుదునా? 
2Sa 4:12  సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి, దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలనుదగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసికొనిపోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతి పెట్టిరి. 

2వ సమూయేలు 5

2Sa 5:1  ఇశ్రాయేలువారి సకల గోత్రములవారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చిచిత్తగించుము; మేము నీ ఎముకనంటినవారము రక్తసంబంధులము; 
2Sa 5:2  పూర్వ కాలమున సౌలు మామీద రాజై యుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడునీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్నుగురించి సెల విచ్చియున్నాడని చెప్పిరి. 
2Sa 5:3  మరియు ఇశ్రాయేలువారి పెద్దలందరు హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలువారిమీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. 
2Sa 5:4  దావీదు ముప్పది యేండ్లవాడై యేల నారంభించి నలు వది సంవత్సరములు పరిపాలనచేసెను. 
2Sa 5:5  హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను. 
2Sa 5:6  యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూ షలేమునకు వచ్చిరి. 
2Sa 5:7  యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచినీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డి వారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమన బడిన1 సీయోను కోటను దావీదు స్వాధీన పరచుకొనెను. ఆ దినమున అతడు 
2Sa 5:8  యెబూసీయులను హతము చేయు వారందరు నీటి కాలువపైకి వెళ్లి, దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు; అతడు ఇంటిలోనికి రాలేడని సామెతపుట్టెను. 
2Sa 5:9  దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. 
2Sa 5:10  దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. 
2Sa 5:11  తూరురాజగు హీరాము, దూతలను దేవదారు మ్రాను లను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. 
2Sa 5:12  ఇశ్రాయేలీయులమీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచెననియు, ఇశ్రాయేలీయులనుబట్టి ఆయన జనుల నిమిత్తము, రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. 
2Sa 5:13  దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూష లేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి 
2Sa 5:14  యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు 
2Sa 5:15  నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ 
2Sa 5:16  ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు. 
2Sa 5:17  జనులు ఇశ్రాయేలీయులమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరు వచ్చిరి. దావీదు ఆ వార్తవిని ప్రాకారస్థలమునకు వెళ్లిపోయెను. 
2Sa 5:18  ఫలిష్తీయులు దండెత్తివచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా 
2Sa 5:19  దావీదునేను ఫిలిష్తీయుల కెదురుగా పోయెదనా? వారిని నా చేతికప్పగింతువా? అని యెహోవా యొద్దవిచారించినప్పుడుపొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. 
2Sa 5:20  కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతముచేసి, జలప్రవాహములు కొట్టుకొనిపోవునట్లు యెహోవా నాశత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను2 పేరు పెట్టెను. 
2Sa 5:21  ఫలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టు కొనిరి. 
2Sa 5:22  ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా 
2Sa 5:23  దావీదు యెహోవాయొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవానీవు వెళ్లవద్దుచుట్టు తిరిగిపోయి, కంబళిచెట్లకు ఎదురుగావారిమీద పడుము. 
2Sa 5:24  కంబళిచెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతముచేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెల విచ్చెను. 
2Sa 5:25  దావీదు యెహోవా తనకాజ్ఞాపించిన ప్రకారము చేసి, గెబనుండి గెజెరువరకు ఫిలిష్తీయులను తరుముచు హతముచేసెను. 

2వ సమూయేలు 6

2Sa 6:1  తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో ముప్పదివేల మంది శూరులను సమకూర్చుకొని 
2Sa 6:2  బయలుదేరి, కెరూబుల మధ్య నివసించు సైన్యములకధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటనుండి తీసికొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను. 
2Sa 6:3  వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబుయొక్క యింటిలోనుండి తీసికొనిరాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. 
2Sa 6:4  దేవుని మందసముగల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటనుండి తీసికొనిరాగా అహ్యో దానిముందర నడిచెను 
2Sa 6:5  దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళము లను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. 
2Sa 6:6  వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా 
2Sa 6:7  యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. 
2Sa 6:8  యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. 
2Sa 6:9  నేటికిని దానికి అదేపేరు. ఆ దినమునయెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి 
2Sa 6:10  యెహోవా మందసమును దావీదు పురములోనికి తనయొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయు డగు ఓబేదెదోము ఇంటివరకు తీసికొని అచ్చట ఉంచెను. 
2Sa 6:11  యెహోవా మందసము మూడునెలలు గిత్తీయుడగు ఓబేదె దోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను. 
2Sa 6:12  దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను. 
2Sa 6:13  ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను, 
2Sa 6:14  దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను. 
2Sa 6:15  ఈలాగున దావీదును ఇశ్రాయేలీయు లందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి. 
2Sa 6:16  యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్య మాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను. 
2Sa 6:17  వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను. 
2Sa 6:18  దహనబలులను సమాధానబలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, 
2Sa 6:19  సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీపురుషుల కందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి. 
2Sa 6:20  తన యింటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చిహీనస్థితి గల పనికత్తెలు చూచు చుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసియెంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు 
2Sa 6:21  నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించు టకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. 
2Sa 6:22  ఇంతకంటె మరి యెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. 
2Sa 6:23  మరణమువరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. 

2వ సమూయేలు 7

2Sa 7:1  యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజుతన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువ నంపి 
2Sa 7:2  నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా 
2Sa 7:3  నాతానుయెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. 
2Sa 7:4  అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా 
2Sa 7:5  నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుముయెహోవా నీకాజ్ఞ ఇచ్చునదేమనగానాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? 
2Sa 7:6  ఐగుప్తులోనుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. 
2Sa 7:7  ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాల మంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవ దారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపక పోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా? 
2Sa 7:8  కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని. 
2Sa 7:9  నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకము లోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను. 
2Sa 7:10  మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లుగా చేసి 
2Sa 7:11  నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగానేను నీకు సంతానము కలుగజేయుదును. 
2Sa 7:12  నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. 
2Sa 7:13  అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను; 
2Sa 7:14  నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని 
2Sa 7:15  నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. 
2Sa 7:16  నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. 
2Sa 7:17  తనకు కలిగిన దర్శన మంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ జెప్పెను. 
2Sa 7:18  దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెనునా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది? 
2Sa 7:19  ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతినిబట్టి, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడ నైన నా సంతానమునకు కలుగబోవుదానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? 
2Sa 7:20  యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగియున్నావు. 
2Sa 7:21  నీ వాక్కునుబట్టి నీ యిష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసితివి. 
2Sa 7:22  కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనతగలవాడవు, నీవంటి దేవుడొకడును లేడు; మేము వినిన దానినంత టిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. 
2Sa 7:23  నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులనుబట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తుదేశములోనుండియు, ఆ జనుల వశములోనుండియు, వారి దేవతల వశములో నుండియు నీవు విమోచించిన ఇశ్రాయేలీయులనునట్టి నీ జనులవంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది. 
2Sa 7:24  మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. 
2Sa 7:25  దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబ మునుగూర్చియు నీవు సెలవిచ్చినమాట యెన్నటికి నిలుచు నట్లు దృఢపరచి 
2Sa 7:26  సైన్యములకధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై యున్నాడను మాటచేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చినమాట నెరవేర్చుము. 
2Sa 7:27  ఇశ్రాయేలీయుల దేవా సైన్యములకధిపతియగు యెహోవానీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. 
2Sa 7:28  యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే; నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. 
2Sa 7:29  దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వ దించుము; యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి యున్నావు; నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.